విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలో నీరు నిలిచిపోయింది. కన్య థియేటర్ సహా పలు దుకాణాల్లోకి నీరు చేరింది. రహదారి విస్తరణ పనుల్లో గుత్తేదారులు కల్వర్టులను కప్పి వేయడంతో నీరు పోయేందుకు మార్గం లేక ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆవేదన చెందారు.
చెరువా... సినిమా థియేటరా...?
విశాఖ జిల్లా నర్సీపట్నంలో కన్య సినిమా థియేటర్ చెరువులా మారిపోయింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో థియోటర్లోకి నీరు చేరింది.
నర్సీపట్నంలో మునిగిన సినిమా థియేటర్