విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం పెద్ద బొడ్డేపల్లిలో జనసేన ఆధ్వర్యంలో మదర్ థెరీస్సాా జయంతిని నిర్వహించారు. మదర్ థెరీస్సా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గూడూరు తాతబాబు ఏర్పాటుచేసిన మదర్ థెరిస్సా విగ్రహం వద్ద జనసేన నియోజకవర్గ నాయకులు రాజన్న, సూర్యచంద్ర పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మదర్ థెరీస్సా జ్ఞాపకార్ధంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో హరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నంలో ఘనంగా మదర్ థెరీస్సా జయంతి - Mother Teresa Birthday Celebrations in narsipatnam latest news
నర్సీపట్నంలో మదర్ థెరీస్సా జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో మొక్కలను నాటారు.
Mother Teresa Birthday