విశాఖకు నుంచి కలకత్తా, బెంగళూరు మీదుగా విమానాలు తిప్పేందుకు స్పైస్ జెట్ సంస్థ ముందుకొచ్చింది. డిసెంబర్ 6 నుంచి వచ్చే ఏడాది మార్చి 27 వరకు రోజువారీ సర్వీసులు తిప్పనున్నట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో హైదరాబాద్ మార్గంలో మరో సర్వీస్‌ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కలకత్తా నుంచి రాత్రి 7:30 బయలుదేరి విశాఖకు 9:10కి విమానం చేరుకుంటుంది. అదేవిధంగా విశాఖ నుంచి రాత్రి 9:40కు బయలుదేరి కలకత్తాకు రాత్రి 11:30లకు చేరుకునేలా సర్వీసులు ప్రవేశ పెట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
విశాఖ విమానాశ్రయానికి మరిన్ని స్పైస్‌జెట్ సర్వీసులు - స్పైస్ జెట్ విమాన సర్వీసులు తాజా వార్తలు
విశాఖ విమానాశ్రయంలో మరిన్ని విమాన సర్వీసులు సందడి చేయనున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు కలకత్తా, బెంగళూరు మీదుగా నగరానికి విమాన సర్వీసులు నడిపేందుకు స్పైస్‌జెట్ ముందుకొచ్చింది.
మరిన్ని స్పైస్ జెట్ విమాన సర్వీసులు