తక్కువ ధరకే బంగారం లభిస్తుందనీ.. ఓ ముఠా చెప్పిన మాయమాటలు నమ్మాడో వ్యాపారి. దీంతో వ్యాపారి నుంచి 20 లక్షల రూపాయలతో నిందితులు ఉడాయించారు. ఈ ఘటన విశాఖ నగరం పాత డెయిరీఫారంలో జరిగింది.
ఏం జరిగిందంటే..
విశాఖ నగరం పాత డెయిరీఫారానికి చెందిన కిరాణా వ్యాపారి పి. కోటేశ్వరరావు బంగారాం కొనాల్సి వచ్చి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే చిట్టిరాజును సంప్రదించాడు. వీరిద్దరూ కలిసి తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి అట్టాడ సీతారామ్ అలియాస్ చంద్రశేఖర్ అలియాస్ రెడ్డిని సంప్రదించారు. అర కిలో బంగారాన్ని 20 లక్షలకు ఇస్తానని నమ్మించాడు.
ఆగస్టు 15:
కోటేశ్వరరావు, చిట్టిరాజు గోపాలపట్నం తాము చెప్పిన దుకాణానికి డబ్బుతో వస్తే ఆ నగదు స్థానంలో ఎలాగోలా తెల్లకాగితాలు ఉంచి వెనక్కి ఇచ్చేయాలని నిందితులు భావించారు. అయితే కోటేశ్వరరావు, చిట్టిరాజు డబ్బులు తీసుకువెళ్లలేదు. బంగారం చూపిస్తేనే డబ్బులు ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు.
ఆగస్టు 17:
డబ్బులతో పీఎంపాలెం స్టేడియం వద్దకు వస్తే బంగారం ఇస్తామని నిందితులు నమ్మించారు. కోటేశ్వరావు, చిట్టిరాజు వెళ్లారు. బంగారం ఇస్తామని నిందితుల నమ్మించారు. కోటేశ్వరరావు, చిట్టిరాజు వెళ్లారు. బంగారం తెచ్చేలోపు డబ్బులు లెక్కపెడదామని పక్కనే ఉన్న వీధిలోకి వీరిని సీతారామ్ తీసుకువెళ్లాడు.