ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 25, 2020, 11:57 AM IST

ETV Bharat / state

వాల్తేర్ కోచింగ్ కేర్ సెంటర్​లో అందుబాటులోకి 6వ ఫిట్ లైన్

రానున్న రోజుల్లో పెరగనున్న బోగీ సామర్థ్యానికి అనుగుణంగా కోచింగ్ కేర్ సెంటర్​ను ఆధునీకరించనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏ.కె. త్రిపాఠి తెలిపారు. తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ కోచింగ్ కేర్ సెంటర్​లో 6వ ఫిట్ లైన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

East Coast Railway Walter Coaching Care Center
అందుబాటులోకి 6వ ఫిట్ లైన్

తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ కోచింగ్ కేర్ సెంటర్​లో 6వ ఫిట్ లైన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏ.కె. త్రిపాఠి తెలిపారు. 26 బోగీల రైలుకు సరిపడే విధంగా 600 మీటర్ల పొడవుతో లైన్​ను తయారు చేసినట్లు వెల్లడించారు. విడి బోగీలు ఉంచడానికి ఆరు స్టేబులింగ్ లైన్లు, విడి చక్రాలు, బోగీల పార్కింగ్ కోసం మరో లైను అందుబాటులోకి వచ్చిందన్నారు. సిబ్బంది చిత్తశుద్ధితో నిరంతరాయంగా శ్రమిస్తూ ప్రయాణికులకు రైళ్లలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details