విశాఖలో అనుమతులు లేకుండా పెడుతున్న విగ్రహాలను తొలగించాలని భాజపా శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో విప్లవ వీరుడు అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో ...అల్లూరి తో పాటు పోరాడిన రామ్, మల్లు, ఘట్టం దొరల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు.
ఆ విగ్రహాల తొలగింపునకు భాజపా డిమాండ్ - alluri birth day celebrations
విశాఖలో అనుమతులు లేని విగ్రహాలు తీసివేయాలని భాజపా శాసన మండలి సభ్యుడు మాధవ్ అన్నారు. విశాఖతో సంబంధం లేని వారి విగ్రహాలను సైతం పెడుతున్నారని అల్లూరి జయంతి వేడుకల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖలో అనుమతుల్లేని విగ్రహాలు తొలగించాలి:ఎమ్మెల్సీ మాధవ్