ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓర్వలేకే ప్రతిపక్షాల ఆరోపణలు: కరణం ధర్మశ్రీ

ఇసుక విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఖండించారు. ప్రతిపక్షాలు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

mla karanam dharma sri
కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే

By

Published : Oct 10, 2020, 3:27 PM IST

ప్రభుత్వం తెచ్చిన ఇసుక విధానం చాలా బాగుందని.. ఇది చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు లేనిపోని అరోపణలు చేస్తున్నాయని విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. చోడవరం మండలం జుత్తాడ గ్రామ ఎంపీపీ పాఠశాలలో చేపట్టిన నాడు- నేడు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.

ఇసుక విషయంలో తనపై వచ్చిన అరోపణలను ధర్మశ్రీ ఖండించారు. జత్తాడ గ్రామంలో ఇసుక తరలింపును నియమ నిబంధనల ప్రకారంగా.. నిర్వహించాలన్నారు. ఇసుక ర్యాంపు పునరుద్ధరణకు కలెక్టరుతో మాట్లాడతానని ప్రజలకు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details