విశాఖ మన్యం పాడేరులో వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటించారు. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్మించబోయే వైద్య కళాశాల స్థలాన్ని పరిశీలించారు. సీఎం జగన్ ఆదేశాలతో వైద్య కళాశాల కోసం పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో 35 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఎంత విస్తీర్ణంలో ఏయే భవనాలు రానున్నాయో అధికారులు మంత్రికి వివరించారు.
పాడేరుకు ముగ్గురు మంత్రులు... వైద్య కళాశాల స్థలం పరిశీలన - పాడేరులో వైద్య కళాశాల తాజా వార్తలు
విశాఖ జిల్లా పాడేరులో ముగ్గురు మంత్రులు పర్యటించారు. అక్కడ నిర్మించబోయే వైద్య కళాశాల స్థలాన్ని... మంత్రులు ఆళ్ల నాని, ముత్తంశెట్టి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్‌లు పరిశీలించారు. త్వరలోనే టెండర్లు పిలిచి నిర్మాణాలు ప్రారంభిస్తామని తెలిపారు.
పాడేరులో వైద్య కళాశాల మ్యాప్‌ను పరిశీలిస్తున్న మంత్రి ఆళ్ల నాని
సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో కళాశాల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. వచ్చే ఆగస్టులో టెండర్లు పిలిచి నిర్మాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. మంత్రి ఆళ్ల నానితో పాటు పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్. రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు.
ఇవీ చదవండి.... కువైట్‌లో కష్టాల్లో 1900 మంది ప్రవాసాంధ్రులు