సామాజిక మాధ్యమల్లో వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టినందుకే నలంద కిశోర్‌ను పోలీసులు అరెస్టు చేశారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఈ విషయంలో పోలీసుల వద్ద పూర్తి సమాచారం ఉందని స్పష్టం చేశారు. ఇంకా చాలా మంది ఈ లిస్టులో ఉన్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి మండిపడ్డారు. నలంద కిశోర్ గురించి గంటా ఆందోళన పడినట్టు కనిపంచడం లేదని... ఇంకేదో ఉందన్నారు అవంతి. కుట్రపూరిత రాజకీయాలు చేసినట్లు ఉందని విమర్శించారు.