విశాఖ జిల్లా పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ సెంటర్‌ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌రావు ప్రారంభించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 50 పడకలతో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీని ప్రారంభం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అదీప్‌రాజ్ నిత్యం ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. కరోనా నుంచి రక్షణ పొందడానికి ప్రంట్‌లైన్ వారియర్స్‌కు వివిధ రకాల వస్తువులను అంజేశారని, చాలామందికి నిత్యావసర వస్తువులు, ఆహారం పంపిణీ చేశారని అభినందించారు. ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు, అంబులెన్సులు, ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు సరఫరా చేశారని కొనియాడారు.
పెందుర్తిలో ఐసోలేషన్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి - MLA Adeep Raj Latest News
పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ సెంటర్‌ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు ప్రారంభించారు. ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ను మంత్రి అభినందించారు.
పెందుర్తిలో ఐసోలేషన్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి