ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్ఆర్ఏపీ యాప్​.. 21 రోజుల్లో 90 ఇండస్ట్రియల్ అనుమతులు

Industrial Policy : విశాఖలో 2023-27 ఇండస్ట్రీయల్ పాలసీని మంత్రి గుడివాడ అమర్నాథ్ విడుదల చేశారు. విశాఖ కేంద్రంగా వైఎస్ఆర్ఏపీ 1 వర్కింగ్ సెంటర్, పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. 9 ఫిషింగ్ హార్బర్, 10 పోర్టులు రాష్ట్రంలో ఉండేలా ప్రణాళిక రచిస్తున్నామని వెల్లడించారు.

ఇండస్ట్రీయల్ పాలసీ
ఇండస్ట్రీయల్ పాలసీ

By

Published : Mar 27, 2023, 7:14 PM IST

Updated : Mar 27, 2023, 8:02 PM IST

Industrial Policy : విశాఖలో 2023-27 ఇండస్ట్రీయల్ పాలసీని మంత్రి గుడివాడ అమర్నాథ్ విడుదల చేశారు. విశాఖ వి.కన్వెన్షన్ సెంటర్లో జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఇండస్ట్రియల్ పాలసీ విడుదల చేశారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలనన్, డైరెక్టర్ సృజన ఈ వేడుకలో పాల్గొన్నారు. పరిశ్రమల కోసం "వైఎస్ఆర్ఏపీ 1" యాప్​ను ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ విడుదల చేశారు. ఇకపై నూతన పరిశ్రమలు పెట్టే వారు యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పరిశ్రమల శాఖ కోరింది.

ఇండస్ట్రీయల్ పాలసీ

మంత్రి గుడివాడ అమర్నాథ్ నూతన పాలసీ ప్రవేశపెడుతూ... సీఎం నేతృత్వంలో సమావేశమై వారి సలహాలతో ఈ పాలసీ రూపొందించామని తెలిపారు. పెట్టుబడిదారులకు ఇబ్బంది లేకుండా పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి, పోర్ట్ లే డెవలప్, కొత్త పాలసీలో ఏపీఐఐసీ ద్వారా భూ కేటాయింపు మూడు వారాల్లో పూర్తి చేస్తామన్నారు. యాప్ ద్వారా 26 విభాగాల నుంచి 90 అనుమతులు 21 రోజుల్లో అందిస్తామన్నారు. జిఐఎస్ సమ్మిట్​లో 14 రంగాల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహన రంగాలను అభివృద్ధి చేస్తామన్నారు. రక్షణ రంగంలో 15 వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.

విశాఖ కేంద్రంగా వైఎస్ఆర్ఏపీ 1 వర్కింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నాం. కొత్తగా పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టనున్నాం, 9 ఫిషింగ్ హార్బర్, 10 పోర్ట్ లు రాష్ట్రంలో ఉండేలా ప్రణాళిక రచిస్తున్నాం. పీపీపీ విధానం లో ఇండస్ట్రీ పార్కులు పెడతాం. ఇందుకు ఆసియాలోనే శ్రీ సిటీ ఒక మంచి ఉదాహరణ. ఐ స్పేస్ పేరిట ఐకానిక్ టవర్ నిర్మిస్తాం. త్వరితగతంగా పరిశ్రమలు నిర్మించే వారికి ఎర్లీ బర్డ్ ఆఫర్ ఇస్తాం. వేర్ హౌసెస్ ని పరిశ్రమగా గుర్తించాం. స్కిల్ డెవలప్​మెంట్​ ద్వారా ఉపాధి కల్పిస్తాం. - గుడివాడ అమర్నాథ్, మంత్రి

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలనన్ మాట్లాడుతూ పాత పాలసీ కంటే కొత్త పాలసీ మిగిలిన రాష్ట్రాల కంటే మేలు చేసే దానిలా ఉందని అన్నారు. మిగిలిన రాష్ట్రాల కంటే అన్ని విధాలా స్నేహపూర్వక, అనుకూలమైన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్ సదస్సులో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. అదే స్ఫూర్తితో వైఎస్ఆర్ఏపీ 1 అనే మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ విడుదల చేశామన్నారు. వ్యాపార రంగంలో రావాలనే ఆలోచన ఉన్న వారికి ప్రోత్సాహంగా ఈ యాప్ నిలుస్తుందని చెప్పారు.

విశాఖలో వైఎస్ఆర్ ఏపీ1 కార్యాలయాన్ని ప్రారంభిస్తాం. ఇన్నోవేషన్ స్టార్టప్ ప్రారంభిస్తున్నాం. ఇంక్యుబేషన్ సెంటర్ కూడా తీసుకువస్తాం. అన్ని రంగాల్లో పరిశోధన, అభివృద్ధి పెంచుకోవాలి. లాజిస్టిక్ కి ప్రత్యేక పాలసీ తీసుకొస్తాం. ఏపీ ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఏర్పాటు చేస్తాం. తీర ఆధారిత రవాణా రంగం అభివృద్ధి చేస్తూ పీపీపీ విధానంలో ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి చేస్తాం. - కరికల్ వలనన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

పరిశ్రమల శాఖ డైరెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ ఈ నెల 3, 4 తేదీల్లో జిఐఎస్ సమ్మిట్ విజయవంతమైనదని చెప్పారు. ఇప్పటివరకు ఒక పాలసీ పూర్తయిన తరువాత నెలల గ్యాప్ తరువాత పాలసీ విడుదల చేశారని, కానీ ఈ సారి పాత పాలసీ పూర్తయిన రోజే కొత్త పాలసీ అమల్లోకి వస్తుందని తెలిపారు. కొత్త పాలసీ నాలుగేళ్లు అమలులో ఉంటుందని చెప్పారు. 2023 ఏప్రిల్ 1 నుంచి నాలుగేళ్లు ఈ ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుందని చెప్పారు. ఆపరేషన్​లో భాగంగా ల్యాండ్ అలాట్​మెంట్ ఉంటుందని, పోర్ట్ లే ఇండస్ట్రీస్ బేస్డ్ డెవెలమెంట్​పై దృష్టి పెట్టినట్టు చెప్పారు.

వైఎస్ఆర్ఏపీ 1 అనే సర్వీస్ ద్వారా అన్ని సర్వీసులు ఒకే చోట ఉంటాయి. 21 రోజుల్లో అనుమతి వచ్చేలా దీనిని తీర్చిదిద్దాం. అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు రావాలని పాలసీ రూపొందించాం. ఐస్పేస్ పేరిట ఇన్నోవేషన్ భవనం ఏర్పాటు చేస్తున్నాం. మారుతున్న పరిస్థితులకు తగట్టుగా, పారిశ్రామిక వేత్తలకు అనుకూలమైన పాలసీగా తీర్చిదిద్దాం. - డాక్టర్ జి సృజన, డైరెక్టర్ పరిశ్రమల శాఖ

ఇవీ చదవండి :

Last Updated : Mar 27, 2023, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details