ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధానికి విశాఖ అనుకూలం: బొత్స

రాష్ట్రంలోని పరిస్థితులను హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. జీఎన్ రావు, బీసీజీ నివేదికను అధ్యయనం చేసి హైపవర్ కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు. రాజధానిగా విశాఖ అనుకూలంగా ఉంటుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి తెలిపారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/29-December-2019/5533009_205_5533009_1577633884617.png
విశాఖ రాజధానికి అనుకూలం: బొత్స

By

Published : Dec 29, 2019, 9:49 PM IST

Updated : Dec 29, 2019, 10:10 PM IST

విశాఖ రాజధానికి అనుకూలం: బొత్స

రాష్ట్రంలోని పరిస్థితులను హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుందని బొత్స సత్యనారాయణ అన్నారు. జరిగిన తప్పులను సరిదిద్దేందుకు కమిటీలు వేశామన్నారు. జీఎన్ రావు, బీసీజీ నివేదికను అధ్యయనం చేసి హైపవర్ కమిటీ నివేదిక ఇస్తుందని... ఆ కమిటీ నివేదికను మంత్రివర్గ భేటీలో చర్చిస్తామన్నారు. రాజధానికి విశాఖ అనుకూలమని తన వ్యక్తిగత అభిప్రాయమని బొత్స అన్నారు. ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే హైదరాబాద్‌ను తలదన్నే స్థాయిలో విశాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధాని మార్చే అధికారం ప్రజలు జగన్‌కు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా కోసం చివరి నిమిషం వరకు పోరాడతామన్నారు. 3 రాజధానులపై అఖిలపక్ష భేటీ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఉత్తరాంధ్రకు రాజధాని రావడంపై అశోక్ గజపతిరాజు మాట్లాడాలని కోరారు.తెదేపా హయాంలో ఎన్నో ప్రాంతాలు నష్టపోయాయని బొత్స ఆరోపించారు. వెనకబడిన , కరువు ప్రాంతాలను అభివృద్ధి చేయడం తెదేపా నేత చంద్రబాబుకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు.

వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చెయ్యడం చంద్రబాబుకు ఇష్టమా.. కాదా..?

ఇదీ చూడండి: నూతన రాజధాని పేరేంటో చెబుతాం: మంత్రి బొత్స

Last Updated : Dec 29, 2019, 10:10 PM IST

ABOUT THE AUTHOR

...view details