ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గీతం వర్సిటీ భూములు ప్రభుత్వానికి చెందినవి: బొత్స సత్యనారాయణ

ఎక్కడైనా అక్రమాలు జరిగితే విచారణ చేపట్టి పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గీతం వర్సిటీ తమవిగా భావిస్తున్న భూములు ప్రభుత్వానివని చెప్పారు. ఆక్రమణ చేశారు కాబట్టే తొలగించామని.. అందులో కక్షసాధింపు ఏమీ లేదని స్పష్టంచేశారు.

bosta satyanarayana
బొత్స సత్యనారాయణ, మంత్రి

By

Published : Oct 25, 2020, 3:28 PM IST

Updated : Oct 25, 2020, 4:09 PM IST

గీతం వర్సిటీ తమవిగా భావిస్తున్న భూములు ప్రభుత్వానికి చెందినవని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ భూమిని దురాక్రమణ చేయాలని చూశారని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలు దోచుకునే వారికి పార్టీలు వత్తాసు పలకడం సరికాదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు క్రమబద్ధీకరణ చేయలేదని బొత్స ప్రశ్నించారు. అక్రమం ఉంటే విచారణ చేపట్టి పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని.. ఇందులో ఎలాంటి కక్షసాధింపు లేదని మంత్రి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేసి తీరుతామన్న బొత్స.. పెరిగిన అంచనాలపై కేంద్రాన్ని ఎన్నిసార్లైనా కేంద్రాన్ని కలుస్తామన్నారు.

చట్టం తన పని తాను చేసుకుపోతుంది. గీతం వర్సిటీ భూములు ప్రభుత్వానికి చెందినవి. అందుకే అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేసింది. తెదేపా అధినేత చంద్రబాబు అక్రమదారులకు వత్తాసు పలకడం సరికాదు. ఎక్కడైనా అక్రమం జరిగితే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ఇదీ అంతే. ఇందులో ఎలాంటి కక్షసాధింపు లేదు.

- బొత్స సత్యనారాయణ, మంత్రి

ఇవీ చదవండి..

చీమకుర్తి గనులపై ప్రభుత్వం దృష్టి!

Last Updated : Oct 25, 2020, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details