విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు విత్తనాలు, క్రిమి సంహారక మందులు, వ్యవసాయ పరమైన సందేహాలకు ఎంతగానో ఇబ్బందులు పడేవారని మంత్రి చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలతో సమస్యలు తీరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
'రైతు భరోసా కేంద్రాలతో తీరిన అన్నదాతల కష్టాలు'
గత ప్రభుత్వ హయాంలో రైతులు విత్తనాలు, క్రిమి సంహారక మందులు, వ్యవసాయ పరమైన సందేహాలకు ఎంతగానో ఇబ్బందులు పడేవారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో సమస్యలు తీరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.
'రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతల కష్టాలు తీరాయి'
ఈ-క్రాప్ ద్వారా కేవలం ఒక్క రూపాయితోనే పంటల బీమా సదుపాయం కల్పిస్తున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా 3 వేల మీటర్ల భారీ వైకాపా జెండాను ఏర్పాటు చేశారు. అనంతరం సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్ రైతు భరోసా చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందించారు.