విశాఖ సింహాచలం దేవస్థానంలో ఇటీవల తొలగింపునకు గురైన వివిధ ఏజెన్సీలకు చెందిన 183 మంది సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. వారికి మంత్రి అవంతి శ్రీనివాస్ రావు చేతుల మీదగా నియామక పత్రాలు అందజేశారు. కరోనా నేపథ్యంలో దేవస్థానం ఆదాయం గణనీయంగా పడిపోయి.. తొలగించిన సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి దృష్టికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీసుకెళ్లారు. తిరిగి నియమించాలని ఆదేశాలు రావడంతో వారిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ సంచయిత గజపతికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
సింహాద్రి అప్పన్న ఆలయంలో ఉద్యోగుల పునర్నియామకం
సింహాద్రి అప్పన్న ఆలయంలోని ఒప్పంద ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. వారికి నియామక పత్రాలను ఉత్తర్వులు మంత్రి ముత్తంశెట్టి అందజేశారు.
సింహాద్రి అప్పన్న ఆలయంలోని ఉద్యోగుల పునర్నియామకం