విశాఖలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటికే జిల్లాలో మూడు కేసులు పాజిటివ్ రావడంతో... తీసుకోవాల్సిన వైద్య చర్యలపై దిశానిర్దేశం చేస్తారు. క్వారంటైన్ నిర్వహణ, సౌకర్యాలపై అధికారులతో మంత్రి చర్చించేందుకు జిల్లా అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
నేడు విశాఖలో ఆళ్ల నాని పర్యటన - విశాఖలో ఆళ్ల నాని పర్యటన వార్తలు
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా నేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విశాఖలో పర్యటించనున్నారు. కలెక్టర్ కార్యాలయంలో వైద్య చర్యలపై అధికారులతో సమీక్షించనున్నారు.
minister Aalla Nani visit today in Visakha for meeting on corona virus in collector office