సార్వత్రిక ఎన్నికల వేల ఉనికి చాటేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ఇప్పటికే యాక్షన్ టీంలు ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు. నిలువరించేందుకు సన్నద్ధంగా ఉండాలని ప్రత్యేక బలగాలను సమాయాత్తం చేశారు. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న నాయకులను అప్రమత్తం చేస్తూ... జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. యాక్షన్ టీం సభ్యుల ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని.... 5 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ప్రముఖ మావోయిస్టుల చిత్రాలతో ఉన్న గోడపత్రికలను ఆయా ప్రాంతాల్లో అతికించినట్లు వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికల వేల...ఉనికి చాటేందుకు సిద్ధమవుతున్నారు - పోలీసులు
ఉనికి చాటేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఇప్పటికే యాక్షన్ టీం లు ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రా ఒడిశా సరిహద్దులో అప్రమత్తత