విశాఖ మన్యం అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని.. పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ అన్నారు. వారు పోలీసులకు స్వచ్ఛందంగా లొంగిపోవాలని కోరారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు స్వస్తిపలికి జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు. నిన్న జరిగిన ఘటనలో కిట్ బ్యాగులు, 303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
'ఎదురుకాల్పుల్లో గాయపడిన మావోయిస్టులు లొంగిపోతే వైద్యం అందిస్తాం' - విశాఖ మన్యంలో మావోయిస్టుల ఎదురుకాల్పులు
మావోయిస్టులు చట్టవ్యతిరేక పనులు మాని జనజీవన స్రవంతిలో కలవాలని విశాఖ జిల్లా పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ సూచించారు. ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.
రాజ్ కమల్, పాడేరు డీఎస్పీ