బుధవారం నుంచి మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత చింతపల్లి సబ్డివిజన్లో భద్రతా పరిస్థితిని ఎస్పీ కృష్ణారావు , నర్సీపట్నం ఓఎస్డీ సతీష్ కుమార్, చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగరనాయుడు పరిశీలించారు. ముందుగా చింతపల్లి, అన్నవరం పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. అనంతరం రాళ్లగెడ్డకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. రాళ్లగెడ్డ అవుట్ పోస్టు సిబ్బందితో ఆయన మాట్లాడారు. అక్కడ భద్రతా పరంగా తీసుకుంటున్న చర్యలను ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ సబ్ డివిజన్ సిబ్బందితో పరిస్థితులపై చర్చించారు. మన్యంలో భద్రత గురించి తీసుకున్న చర్యలు, భద్రతా ఏర్పాట్లుతో పాటు ఏవోబీలో తీసుకుంటున్న చర్యలు గురించి ఏఎస్సీ వివరించారు. ఏవోబీలో పర్యవేక్షణ కోసం తీసుకువచ్చిన కొత్త డ్రోన్‌లను ఎస్పీ పరీక్షించి, దాని పనితీరును గమనించారు.
పీఎల్‌జీఏ వారోత్సవాలు.. చింతపల్లి సబ్డివిజన్లో తనిఖీలు - PLGA Week celebrations in Visakhapatnam
మావోయిస్టు ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం వారోత్సవాల నేపథ్యంలో విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు , నర్సీపట్నం ఓఎస్డీ సతీష్ కుమార్, చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగరనాయుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం రాళ్లగెడ్డ సాయుధ అవుట్ పోస్టును తనిఖీచేశారు.
మావోయిస్టు ప్రభావిత చింతపల్లి సబ్డివిజన్లో తనీఖీలు