Boy Kidnap: విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ మహాలక్ష్మిపురంలో గుర్తు తెలియని వ్యక్తి బాలుడ్ని అపహరించేందుకు ప్రయత్నించాడు. గత రాత్రి గ్రామంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు.. ఆ ఇంట్లోని మూడు సంవత్సరాల బాలుడిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. స్థానికులు ఈ విషయం గమనించి అతడిని పట్టుకున్నారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం భీమిలి పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు.
మూడేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం.. పట్టుకున్న గ్రామస్థులు - boy Kidnap
Trying To Kidnap: గుర్తు తెలియని ఓ వ్యక్తి విశాఖ జిల్లాలో మూడు సంవత్సరాల బాలుడ్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు అతడ్ని పట్టుకున్నారు. అతన్ని పోలీసులకు అప్పగించిన తర్వాత అసలు ట్విస్ట్ బయటపడింది. అసలు ఏం జరిగిందంటే..?
కిడ్నాప్
స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతడి వివరాలు ఆరా తీస్తుండగా.. పొంతన లేని సమధానాలతో హిందీలో మాట్లాడుతున్నాడని పోలీసులు తెలిపారు. దీంతో అతడికి మతిస్తిమితం లేదని పరిగణించిన పోలీసులు మానసిక వైద్యశాలకు తరలించినట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: