ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సందడిగా మాచ్​ఖండ్​ ప్రభుత్వ పాఠశాల స్వర్ణోత్సవాలు

1968లో స్థాపించిన మాచ్​ఖండ్​ ప్రభుత్వ పాఠశాల స్వర్ణోత్సవాలను పూర్వవిద్యార్థులంతా కలిసి నిర్వహించారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులలో గల మాచ్​ఖండ్​ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణమంతా స్నేహితుల పలకరింపులతో పండువ వాతావరణం నెలకొంది.

మాచ్​ఖండ్​ ప్రభుత్వ పాఠశాల స్వర్ణోత్సవాలు

By

Published : May 13, 2019, 12:37 PM IST

Updated : May 14, 2019, 2:19 PM IST

సందడిగా మాచ్​ఖండ్​ ప్రభుత్వ పాఠశాల స్వర్ణోత్సవాలు

ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో గల మాచ్​ఖండ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణమంతా... ఆత్మీయుల ఆలింగనాలూ, పలకరింపులతో పండగ వాతావరణం నెలకొంది. 1968లో స్థాపించిన ఈ పాఠశాలకు పూర్వవిద్యార్థులంతా కలసి స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మాచ్​ఖండ్ జల విద్యుత్ కేంద్రం పరిధిలో ఉద్యోగుల పిల్లల కోసం మొట్టమొదట ఇక్కడ పాఠశాల ఏర్పాటు చేశారు.

ప్రాజెక్టు పరిధిలో గల జోలాపుట్, ఒనకఢిల్లీ, మాచ్​ఖండ్​ ప్రాంతాలకు ఒకే ఒక్క పాఠశాల. దశాబ్దం వరకు ఇక్కడికి అనేక మంది వచ్చి చదువుకునేవారు. ఈ నెల 11,12 తేదీలలో పూర్వ విద్యార్థులంతా సామాజిక మాధ్యమాల ద్వారా ఏకమై పూర్వవిద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు... చిన్ననాటి స్నేహితులను కలసి వారి మధుర జ్ఞాపకాలను మరో మారు గుర్తు చేసుకున్నారు.

Last Updated : May 14, 2019, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details