ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న మాచ్ఖంచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. అత్యంత మారుమూల ప్రాంతంలో ఉన్న పాఠశాలలో ఓనమాలు నుంచి ఉన్నత విద్య వరకు చదువుకున్న వారంతా వివిధ చోట్ల స్థిరపడ్డారు. స్వర్ణోత్సవాలు సందర్భంగా... పూర్వ విద్యార్థులందరూ ఏకమై ఈ నెల 11,12 తేదీలలో ఉత్సవాలు జరపడానికి రంగం సిద్ధం చేశారు. 1968లో ఇక్కడ పాఠశాలను స్థాపించారు. ఇప్పటివరకు దాదాపు ఐదు వేల మందికి పైగా విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించారు. ఈ పాఠశాలలో చదువుకున్న వారిలో కలెక్టర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు, తహసీల్దార్లుగా స్థిరపడ్డారు. ప్రస్తుతం పూర్వ విద్యార్థుల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలకు రంగు రంగుల చిత్రాలు వేస్తూ తమ చదువుల బడికి ముస్తాబు చేస్తున్నారు. బాల్యం నాటి తీపి జ్ఞాపకాలను పాత మిత్రులతో మరో మారు పంచుకోవడానికి అందరూ స్వర్ణత్సవాల గురుంచి ఎదురు చూస్తున్నారు.
చదువుల బడికి స్వర్ణోత్సవాలు - చదువుల బడికి స్వర్ణోత్సవాలు
ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న మాచ్ఖంచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు ఈ నెల 11, 12 తేదీల్లో స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నారు.
చదువుల బడికి స్వర్ణోత్సవాలు