విశాఖలో ప్రేమికుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. గోపాలపట్నంలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న మక్కా శిరీష, యలమంచిలికి చెందిన వెంకటేష్ వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరి ప్రేమికుల మధ్య ఫోన్లో జరిగిన సంభాషణ వాగ్వాదానికి దారి తీసినట్టు తెలుస్తోంది. కోపం పట్టలేక.. శిరీష మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న వెంకటేష్... కంచరపాలెం సమీపంలో మధుసూదనగర్ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఇద్దరి మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి పోలీసులు తరలించారు.
ప్రేయసి ఆత్మహత్య తెలిసి.. ప్రియుడి బలవన్మరణం - కంచరపాలెంలో యువకుడి ఆత్మహత్య
ప్రేయసిలేని జీవితం వ్యర్థం అనుకున్నాడో యువకుడు. ఆమె చనిపోయింది అని తెలియగానే... తనూ తనువు చాలించాలనుకున్నాడు. బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మృతిచెందిన శిరీష, వెంకటేష్