విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు జాతీయ రహదారిలో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్లకు ముందున్న లారీ.. వెనక ఢీ కొట్టిన లారీ మధ్యలో ఇరుక్కొని రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ కార్లలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
లారీ వేగంగా రావడం వల్లే ప్రమాదం జరిగిందని వాహనదారులు అన్నారు. ఢీ కొట్టిన లారీ చోదకుడు పరారయ్యాడు. లారీని స్వాధీనం చేసుకున్న అనకాపల్లి పట్టణ పోలీసులు, కేసు నమోదు చేశారు.