సముద్రంలో చేపల వేటకు రంగం సిద్ధమయ్యింది. చరిత్రలోనే తొలిసారిగా సముద్ర చేపల వేట నిషేధ కాలాన్ని 61 రోజుల నుంచి 47 రోజులకు కుదించి, వేటకు అనుమతిస్తున్నారు. తూర్పు తీరమంతటా మే 31 అర్ధరాత్రి 12 గంటలతో నిషేధం ముగియనుంది. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు, వేలం పాటదార్లు, బోట్ యజమానులు, కళాసీలు చిరు మత్స్యకారులకు కరోనా వైరస్ వ్యాప్తి పట్ల అవగాహన కల్పించినట్లు విశాఖ మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఫణి ప్రకాశ్ వివరించారు. వేటకు వెళ్లనున్న మత్స్యకారులు పాటించే కరోనా జాగ్రత్తలు పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
అర్ధరాత్రితో ముగియనున్న వేట నిషేధం
చరిత్రలోనే తొలిసారిగా సముద్ర మత్స్యవేటపై ఉన్న నిషేధాన్ని కుదిస్తూ వేటకు అనుమతిస్తున్నారు. తూర్పు తీరమంతటా చేపల వేటకు నేటి అర్ధరాత్రి 12 గంటలతో నిషేధం ముగియనుంది.
అర్ధరాత్రితో ముగియనున్న వేట నిషేధం