లాక్ డౌన్లో ఉన్న వలస కార్మికులు, నిరుపేదలకు ఎల్ అండ్ టీ హైడ్రోకార్బన్ ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది అండగా నిలిచింది. ఈ మేరకు కలెక్టర్ వినయ్ చంద్‌ను కలిసి ఆహారపు కిట్లను అందజేశారు. ఈ కిట్‌లో ఐదు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ గోధుమ పిండి, లీటర్ ఆయిల్ ఉంటాయి. ఇలాంటివి 12 వందల కిట్లను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్‌కు సిబ్బంది తెలిపారు.
విశాఖలో నిరుపేదలకు ఎల్ అండ్ టీ చేయూత - విశాఖలో కరోనా నియంత్రణ చర్యలు
లాక్డౌన్ దృష్ట్యా విశాఖలో వలస కార్మికులు, నిరుపేదలకు నిత్యావసరాల కిట్లను ఎల్ అండ్ టీ సిబ్బంది కలెక్టర్‌కు అందజేశారు.
నిత్యావసరాల సరఫరాపై కలెక్టర్‌తో ఎల్&టీ సిబ్బంది సమావేశం