ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

School Students Innovation : పాఠశాల విద్యార్థినులే కానీ.. సూపర్​ టాలెంట్​..

Gurukul School Students Innovation : వారు పాఠశాల విద్యార్థినులే కానీ.. వారి అవిష్కరణలు మాత్రం సమాజానికి ఉపయోగపడేలా ఉన్నాయి. వైద్యులు అందుబాటులో లేని సమయంలోని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు, మహిళ భద్రత కోసం పరికరాలను రూపొందించారు. ఇవే కాకుండా వారు పలు జాతీయ గుర్తింపులను కూడా వారి సొంతం చేసుకున్నారు.

Kommadi Gurukul Students
కొమ్మాది గురుకుల విద్యార్థినిల అవిష్కరణలు

By

Published : May 27, 2023, 3:32 PM IST

పాఠశాల విద్యార్థినులే కానీ.. సూపర్​ టాలెంట్​..

Kommadi Dr. BR Ambedkar Gurukulam School : వారంతా పది తరగతిలోపు పాఠశాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిలు. కానీ, వారు సాధించిన ఫలితాలు మాత్రం వారి వయస్సుకు మించి ఉన్నాయి. కేవలం సెకన్ల వ్యవధిలో రసాయన శాస్త్రంలోని మూలకాల ఆవర్తన పట్టిక, పరమాణు ద్రవ్యరాశుల పఠనం, వర్ణమాలను చివరి నుంచి మొదటి వరకు చదివి తెలుగు బుక్​ ఆఫ్​ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నారు. తాజాగా మహిళల భద్రత కోసం ఓ పరికారాన్ని రూపొందించారు. అంతేకాకుండా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు, వైద్యులు అందుబాటులో లేని సమయంలో ఉపయోగపడేందుకు డాక్టర్​ ర్యాడ్​ అనే పేరుతో మరో డివైస్​ను రూపొందించారు.

విశాఖ జిల్లా కొమ్మాదిలోని డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ గురుకుల పాఠశాలలోని విద్యార్థినులు చదువుల్లో చురుకుగా ఉండటమే కాకుండా పలు నూతన అవిష్కరణలతో తమ ప్రతిభ చూపిస్తున్నారు. వసతి గృహల్లోని మహిళల రక్షణ కోసం వారు ఓ పరికరాన్ని రూపొందించారు. ఆ పరికరం అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ఎమర్జెన్సీ సమయాల్లో, అపరిచిత వ్యక్తులు వసతి గృహంలోకి చొరబడినప్పుడు.. అలర్ట్​ మెసేజ్​లు పంపించేలా పరికరాన్ని రూపొందించారు. దానికి మహిళా భద్రత పరికరం (ఉమెన్​ ప్రోటేక్షన్ డివైస్​ ) అని పేరు పెట్టారు. సమస్యను బట్టి కావాల్సిన వారిని అలర్ట్​ చేసేందుకు ఆ పరికరానికి గ్రీన్​, బ్లూ, రెడ్​ పానిక్​ రంగుల్లో బటన్లను అమర్చారు.

ఇదీ చదవండి :సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య.. పెళ్లిరోజునే దారుణం..

సైన్స్​ బోధిస్తున్న ఉపాధ్యాయుడు టి. రాంబాబు అధ్వర్యంలో పదో తరగతి చదువుతున్న వై. జెస్సిక, కె. ప్రవల్లికలు అనే విద్యార్థినులు.. ఉమెన్​ ప్రొటెక్షన్​ డివైజ్​ను రూపొందించారు. దీనిని పీసీబీ బోర్డు, మోడ్ ఎంసీయూ, మెక్రో ట్రాన్స్ఫార్మర్, పానిక్ సెన్సార్లతో, బటన్లతో టచ్ ఏర్పాటు చేశారు. దీన్ని బ్లింక్ యాప్ ద్వారా సెల్​ఫోన్లకు అనుసంధానం చేశారు. ఇంటర్నెట్​ అవసరం లేకుండా కేవలం జీఎస్​ఎం ద్వారా సిమ్​ టు సిమ్​ సమాచారం అందేలా మహిళ భద్రత పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరం జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది.. కాపీ రైట్​, పేటెంట్​ దిశగా అడుగులు వేస్తోందని వారు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో, వైద్యులు అందుబాటులో లేని సమయాల్లో.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పరిష్కారించుకునేందుకు డాక్టర్​ ర్యాడ్​ పేరుతో మరో పరికరాన్ని వీరు రూపొందించారు. ఈ పరికరానికి మన ఆరోగ్య సమస్యను చెప్పగానే.. పరిష్కరాన్ని సూచిస్తోంది. డాక్టర్​ ర్యాడ్​ అనే ఈ డివైజ్​ దగ్గు, జలుబు, జ్వరం, గొంతులో నొప్పి వంటి సమస్యలు దానికి వివరించగానే.. సమస్య నివారణ కోసం మార్గాలను సూచిస్తోంది. డాక్టర్​ అందుబాటులో లేని సమయంలో, కరోనా వంటి పరిస్థితుల్లో ఈ పరికరం ఉపయోగపడుతోందని వివరించారు.

ఇదీ చదవండి :ఇక గుండె సమస్యలకు 'స్టంట్'​ వేయక్కర్లేదు.. 'లేజర్​ థెరపీ'తోనే చెక్​.. ఖర్చు ఎంతంటే?

గతంలోనూ చాలా రికార్డులు :ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వహించిన పలు పోటీల్లో ప్రతిభ చాటి పలువురి మన్ననలు పొందారు. రసాయన శాస్త్రంలోని మూలకాల ఆవర్తన పట్టిక వంటి ఇతర పట్టికలను సెకన్ల వ్యవధిలో పఠించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం కైవసం చేసుకున్నారు.

  • పదో తరగతికి చెందిన కె. ప్రవల్లిక రసాయన శాస్త్రంలోని మూలకాల ఆవర్తన పట్టికను 18 సెకన్లలో పఠించి గతంలో 22 సెకన్ల వరల్డ్ రికార్డ్ను తిరగ రాసింది.
  • 8వ తరగతి చదువుతున్న వి. హర్షిత 55 సెకన్ల వ్యవధిలోనే పరమాణు ద్రవ్యరాశుల ఆవర్తన పట్టికను పఠించింది.
  • ఏడో తరగతి విద్యార్ధిని టి. కుసుమ పావని కుమారి 100 నుంచి 1 వరకు సంఖ్యలను వెనక నుంచి ముందుకు 37 సెకన్లలో పఠించి అందరినీ ఆకట్టుకుంది.
  • ఆరో తరగతి విద్యార్థిని బి. ధనుశ్రీ 1 నుంచి 100 అంకెలను మూడు భాషల్లో 47 సెకన్లలోనే పఠించింది.
  • ఐదో తరగతి చదువుతున్న సీహెచ్. చిత్ర ఇంగ్లీష్​ వర్ణమాలను Z నుంచి A వరకు 3 సెకన్లలో పఠించి ఆకట్టుకుంది.
  • సైన్సు ఉపాధ్యాయులు డాక్టర్ టి. రాంబాబు 37 సెకన్లలో రసాయనశాస్త్రంలో మూలకాల ఆవర్తన పట్టికను పఠించారు.

ఇదీ చదవండి :మార్స్ నుంచి ఏలియన్స్ సందేశం! డీకోడ్ చేయలేక సైంటిస్టుల ఇబ్బందులు.. హెల్ప్ చేస్తారా?

ABOUT THE AUTHOR

...view details