విశాఖలో ఈ నెల 20న అపహరణకు గురైన వేణుగోపాల్, సాంబశివరావు క్షేమంగా ఉన్నారు. అపహరణ కేసును విశాఖ పోలీసులు ఛేదించి... ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కర్రీదాసు, కొడరాజు, నరేశ్ అనే వ్యక్తులు అపహరించినట్లు గుర్తించిన పోలీసులు... ఆర్థిక లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. అపహరించిన నిందితులు వడ్డీ వ్యాపారులేనని డీసీపీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. నిందితుల నుంచి ఆయుధాలు, చరవాణులు, స్టాంప్ పేపర్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
అపహరణ కేసును ఛేదించిన విశాఖ పోలీసులు - kidnap case
విశాఖలో అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 20న అపహరణకు గురైన వేణుగోపాల్, సాంబశివరావు క్షేమంగా ఉన్నట్లు విశాఖ పోలీసులు తెలిపారు.
అపహరణ కేసును ఛేదించిన విశాఖ పోలీసులు