ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాటరీ మింగిన చిన్నారి.. సురక్షితంగా వెలికితీసిన వైద్యులు.. ఎక్కడంటే??

Girl Swallowed Battery : సాధారణంగా చిన్నపిల్లలు ఆడుకుంటూ రూపాయి బిల్లలు మింగడం, చిన్న చిన్న వస్తువులు నోట్లో పెట్టుకుంటే గొంతులో ఇరుక్కుపోవడం లాంటి ఘటనలు చాలానే విన్నాము, చూశాము. ఇక్కడ కూడా మానసిక స్థితి సరిగ్గా లేని ఓ చిన్నారి ఆడుకుంటూ బ్యాటరీని మింగింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఎండోస్కోపి ద్వారా చిన్నారి పొట్టలో ఉన్న బ్యాటరీని తొలగించిన వైద్యులు ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు.

Visakhapatnam KGH
విశాఖ కేజీహెచ్

By

Published : Nov 9, 2022, 10:53 PM IST

Updated : Nov 10, 2022, 2:17 PM IST

బ్యాటరీని మింగిన చిన్నారి.. సురక్షితంగా వెలికితీసిన వైద్యులు

Girl Swallowed Battery In Visakha : విశాఖలో ప్రశాంతి అనే 9 ఏళ్ల బాలిక ఉదరం (పొట్ట)లో ఇరుక్కుపోయిన బ్యాటరీని కేజీహెచ్ వైద్యులు సురక్షితంగా వెలికితీశారు. కాకినాడకు చెందిన ప్రశాంతి మానసిక స్థితి సరిగ్గా లేక ఇబ్బంది పడుతోంది. ఈనెల 6న బ్యాటరీతో ఆడుకుంటూ పొరపాటున దాన్ని మింగేసింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చిన్నారిని కాకినాడ నుంచి విశాఖ కేజీహెచ్ పిల్లల వార్డుకు తీసుకొచ్చారు. పిల్లల వైద్యుల సిఫార్సు మేరకు బాలిక ఆరోగ్య స్థితిని ఉదరకోశ వ్యాధుల విభాగాధిపతి ప్రొఫెసర్​ డాక్టర్​ ఎల్​ఆర్​ఎస్​ గిరినాథ్​ పరిశీలించారు.

ఎక్స్​రే తీసి చూడగా పొట్టలో బ్యాటరీ ఉన్న విషయం నిర్ధరణ అయ్యింది. పొట్టలో ఒక భాగంలో ఇరుక్కుపోయిన బ్యాటరీని ఎండోస్కోపి పద్ధతిలో అత్యంత జాగ్రత్తగా వెలికి తీశారు. బ్యాటరీ సుమారు 5 సెంటీమీటర్ల పొడవు, 1.20 సెంటీమీటర్ల వెడల్పుతో ఉందని డాక్టర్ గిరినాథ్​ తెలిపారు. మరికొంత ఆలస్యమైతే బ్యాటరీ లీక్ అయి కెమికల్ ఇన్ఫెక్షన్ వచ్చి బాలిక ఆరోగ్య స్థితి విషమించేదని.. సకాలంలో తీసుకురావడం వల్ల బాలిక పూర్తిస్థాయిలో కోలుకుందన్నారు.

గతంలో చిన్న వస్తువులను ఎండోస్కోపి ద్వారా వెలికి తీశామని,.. ఐదు సెంటీమీటర్ల పొడవు ఉన్న బ్యాటరీ తీయడం ఇదే తొలిసారన్నారు. ఎండోస్కోపితో తీయడం కొంత క్లిష్టమైనప్పటికి.. జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ఆపరేషన్​ సఫలం అయిందన్నారు. ఈ ప్రక్రియలో డాక్టర్ గిరినాథ్​​తో పాటు జీఈ విభాగ సహాయ ప్రొఫెసర్లు డాక్టర్ వంశీ, డాక్టర్ శ్రీదేవి, మత్తు (అనస్తీషియా) విభాగ సహాయ ప్రొఫెసరు డాక్టర్ సంధ్య పాల్గొన్నారు. మూడు రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడ్డ బాలికకు కేవలం రెండు నిమిషాల వ్యవధిలో వైద్యులు ఊరట కల్పించారు. ఆసుపత్రి పర్యవేక్షణ వైద్యాధికారి డాక్టర్ మైథిలీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పూర్తి చేశామని డాక్టర్ గిరినాథ్ తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 10, 2022, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details