విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో అర్ అండ్ బి రహదారులను కేంద్ర నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. చోడవరంలోని తన క్యాంపు కార్యాలయంలో అర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. కశింకోట నుంచి వడ్డాది జంక్షన్, చోడవరం మీదుగా అనకాపల్లి వరకూ 53 కి.మీ మేర రహదారికి కేంద్ర నిధులు అడగాలని సమావేశంలో తీర్మానించారు. ఈ రహదారిలో రక్షణ శాఖకు చెందిన డీఆర్డీవో ఉండటం వల్ల 120 అడుగుల మేర విస్తరణ చేయాలని ధర్మశ్రీ తెలిపారు. ఇందుకు రూ.300 కోట్లు కేంద్రాన్ని, మరో రూ.300 కోట్లుతో ఇతర మార్గాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
కశింకోట, అనకాపల్లిని కలుపుతూ రూ.600 కోట్లతో వలయ రహదారి - anakapali
కశింకోట నుంచి అనకాపల్లిని కలుపుతూ 53 కి.మీ మేర రహదారికి కేంద్ర నిధులతో రహదారి అభివృద్ధి చేయనున్నట్లు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు.
అర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులతో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ