ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం

By

Published : Dec 15, 2020, 11:54 AM IST

విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ నిబంధనల వల్ల ఈసారి ఎటువంటి హడావుడి లేకుండా వేడుకలు నిర్వహిస్తున్నారు. స్లాట్‌ టికెట్లు తీసుకున్న వారిని మాత్రమే దర్శనాలకు అనుమతించనున్నారు. మంగళవారం ఉదయం 10.10 గంటలకు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు గణేష్‌కుమార్‌ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.

Kanakamahalakshmi
Kanakamahalakshmi

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. విశాఖ బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఈ ఉదయం ఆరంభమయ్యాయి. ఉదయం 10.10 నిమిషాలకు ఉత్సవాలు వైదిక కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది మార్గశిర మాసంలో ఐదు గురువారాలు వస్తున్నాయి. ఆరోజుల్లో అమ్మవారికి పంచామృత అభిషేకం, స్వర్ణాభరణ అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఉచిత దర్శనం, సహా అన్నిదర్శనాలకు ముందుగా స్లాట్ ఆన్ లైన్లో బుక్ చేసుకున్న తర్వాతనే అనుమతి ఉంటుంది.

ఆలయంలో ఎటువంటి టిక్కెట్లను విక్రయించరు. జగదాంబ జంక్షన్ వద్ద అంబికా బాగ్ సీతారామస్వామి అలయం, టౌన్ కొత్త రోడ్ జగన్నాధస్వామి అలయం వద్ద టైమ్ స్లాట్ టోకెన్లను విక్రయిస్తున్నారు. అమ్మవారి దర్శనం ఉదయం ఆరు నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఉంటుంది. మార్గశీర్ష మాసంలో గురువారాలలో 12 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. మాస్క్ ధరించడం , స్లాట్ తీసుకోవడం తప్పనిసరి. అమ్మవారికి భక్తులు నేరుగా అభిషేకాలు వంటివి నిర్వహించేందుకు ఈసారి అనుమతి లేదు. కేవలం దర్శనం మాత్రమే ఉంటుంది. ఈనెల 15 నుంచి జనవరి 13 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి.

ABOUT THE AUTHOR

...view details