ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళ్యాణలోవలో మైనింగ్ తో రిజర్వాయర్ కు ప్రమాదం

విశాఖ జిల్లాలో కళ్యాణలోవలో మైనింగ్ పై విశ్రాంత ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ నేతృత్వంలో జరిగిన ప్రజా వేదిక లో, రైతులు-గిరిజనలు తమ వాదనను వినిపించారు. మైనింగ్ తో కళ్యాణపులోవ ప్రాంతం కాలుష్యంగా మారుతుందని, రిజర్వాయర్ కు గండిపడే అవకాశం ఉందనే ఆందోళనను వ్యక్తం చేశారు.

కళ్యాణలోవలో మైనింగ్ అనుమతులపై విశాఖలో ప్రజావేదిక

By

Published : Oct 20, 2019, 12:22 PM IST

కళ్యాణలోవలో మైనింగ్ అనుమతులపై విశాఖలో ప్రజావేదిక

విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణపులోవ లో మైనింగ్ అనుమతులు వెంటనే రద్దు చేయాలనిగిరిజనులు,రైతులు డిమాండ్ చేశారు.విశ్రాంత ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ నేతృత్వంలో విశాఖలో నిర్వహించిన ప్రజా వేదికలో రైతులు,గిరిజనులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ప్రస్తుతం నాలుగు గ్రానైట్ క్వారీలకు అనుమతి ఉందని,మరో22దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.మైనింగ్ కోసం వెళ్లే భారీ వాహనాలతో రహదార్లు పూర్తిగా ఛిద్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.క్వారీనుంచి వచ్చే వ్యర్ధాలతో ఆ ప్రాంతం కాలుష్యంగా మారిందని చెప్పారు.ఈ వ్యర్ధాలు రిజర్వాయర్ లోకి ప్రవహించే అవకాశం ఉందని,దీంతో తాగు-సాగు నీరు కలుషితం అవుతుందని రైతులు,గిరిజనలు పేర్కొన్నారు.క్వారీ పేలుళ్లకు కళ్యాణపు లోవ రిజర్వాయర్ దెబ్బతిని గండి పడితే మాత్రం దాదాపు పది గ్రామాలు కొట్టుకుపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details