ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలోని వంద గ్రామాలకు రాకపోకలు బంద్! - దేవరాపల్లి కాజ్​వే

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. శారదా నదిలో నీటి ధాటికి విశాఖ జిల్లా దేవరాపల్లి కాలిబాట కొట్టుకుపోయింది. వేలాదిమంది ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

kajway collapse
కొట్టుకుపోయిన కాలినడక వంతెన

By

Published : Oct 14, 2020, 3:12 AM IST

శారదా నది ఉద్ధృతికి విశాఖ జిల్లా దేవరాపల్లి వద్దనున్న కాలిబాట వంతెన కొట్టుకుపోయింది. అనంతగిరి, హుకుంపేట, దేవరాపల్లికి చెందిన దాదాపు 100 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

రైవాడ జలాశయం గేట్లు ఎత్తి శారదా నదికి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రవాహం పెరగడంతో వరద ఉద్ధృతికి వంతెన నామరూపాలు లేకుండా పోయింది. సంబంధిత సిబ్బంది తక్షణం స్పందించి.. పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details