ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 30, 2020, 12:14 PM IST

ETV Bharat / state

ఖరీఫ్ కొనుగోళ్లుకు సిద్దంకండి: జేసీ

రైతుల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన నవంబరు 15 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని, ధాన్యం కొనుగోలు చేయనున్న సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ తయారు చేయాలని ఆదేశించారు.

joint collector review
వ్యవసాయ సంబంధిత అధికారులతో జేసీ సమీక్ష

ఖరీఫ్​లో పండించే ధాన్యం కొనుగోలుకు సిద్దంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 2020-21కు ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పంట పండించే గ్రామాల జాబితా సిద్దం చేయాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులకు జేసీ ఆదేశించారు. ధాన్యం సేకరణకు సంబంధించి విధి విధానాలపై అధికారులతో చర్చించారు. గ్రామాలు, రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి బేనర్లు పెట్టాలని, కరపత్రాలు పంపిణీ చేయాలని తెలిపారు. వెలుగు సిబ్బంది, పీఎసీఎస్ గ్రూపులు వెళ్లి నాణ్యత, రికార్డ్స్, ప్రతీరోజు రిపోర్టులు అందజేయాలని సూచించారు. రైస్ మిల్లులు సిద్దంగా ఉంచాలని డీఎస్ఓ రూరల్ శివ ప్రసాద్ కు సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details