ఇసుక లభ్యత, వాహనాల లోడింగ్, అన్లోడింగ్ పై విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇసుక సరఫరా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుక వినియోగదారులకు వీలైనంత వేగంగా సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం గోదావరి వరదపోటు ఉన్నందున తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇసుక మందగించిందని... శ్రీకాకుళం నుంచి ఇసుకను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇసుక లభ్యత పై విశాఖ జాయింట్ కలెక్టర్ సమీక్ష
విశాఖజిల్లాలో ఇసుక సరఫరా వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ఇసుక డిపోలలో ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇసుక లభ్యత పై జాయింట్ కలెక్టర్ సమీక్ష
ఇసుక తరలింపునకు వచ్చే వాహనాల వివరాలను సాండ్ ఎన్ఫోర్స్మెంట్ వారికి తెలియజేయాలని ఆదేశించారు. ఇసుక సరఫరాలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, ఉప రవాణా కమిషనర్ రాజరత్నం, భూగర్భ గనులశాఖ సహాయ సంచాలకులు బైరాగినాయుడు పాల్గొన్నారు.