జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర మంత్రుల చేసిన అనుచిత వాఖ్యలను విశాఖ జిల్లా జనసేన నేతలు ఖండించారు. రాష్ట ప్రభుత్వం కాపు రిజర్వేషన్‌కు సంబంధించిన శ్వేత పత్రం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన బడుగు బలహీన వర్గాలతో పాటు కాపులకు న్యాయం చేయాలని కోరారు. ఏడాదికి 2 వేల కోట్లు నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని, లేని పక్షంలో తగు పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.
మంత్రుల వ్యాఖ్యలపై మండిపడ్డ జనసేన నేతలు
పవన్ కల్యాణ్ పై మంత్రులు చేసిన వాఖ్యలను విశాఖ ఏండాడ జనసేన పార్టీ నేతలు ఖండించారు. కార్యాలయంలో స్పందించిన జనసేన నేతలు.. పనన్ కల్యాణ్ అడిగిన కాపు రిజర్వేషన్‌పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రుల వ్యాఖ్యలపై మండిపడ్డ జనసేన నేతలు
TAGGED:
janasena latest news update