విశాఖ జిల్లాలోని మోదకొండమ్మ ఉత్సవాల్లో జెయింట్ వీల్ నుంచి జారిపడి ముగ్గురు గాయపడిన ఘటనలో.. నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే వీడియో బయటకు రావటంతో పోలీసులు చర్యలు చేపట్టారు. జెయింట్ వీల్ తిరిగే సమయంలో బోల్ట్ ఊడి కింద పడిన ఘటన కళ్లకు కట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. సరైన భద్రత చర్యలు తీసుకోని కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు.
మోదకొండమ్మ ప్రమాద ఘటనలో నిర్వాహకుడి అరెస్ట్ - మోదకొండమ్మ
మోదకొండమ్మ ఉత్సవాల్లో జెయింట్ వీల్ నుంచి జారిపడి ముగ్గురు గాయపడిన ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. జాయింట్ వీల్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు.
మోదకొండమ్మ ఉత్సవాల్లో అపశ్రుతి
ఇవి చదవండి....అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ సురక్షితం