ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెరిగిన బెల్లం ధరలు... రైతుల్లో ఆనందం

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్​లోకి 15రోజులుగా సరకు తక్కువగా వస్తోంది. బెల్లం సరఫరా తగ్గడంతో ధరలు బాగా పెరిగాయి. 10 కిలోల బెల్లం రూ.360కి చేరింది. ఈ ఏడాది బెల్లం ధర ఆశాజనకంగా ఉందని మార్కెట్ కమిటీ అధికారులు చెబుతున్నారు.

By

Published : May 10, 2019, 1:01 PM IST

పెరిగిన బెల్లం ధరలు... రైతుల్లో ఆనందం

పెరిగిన బెల్లం ధరలు... రైతుల్లో ఆనందం

బెల్లం తయారు కావాలంటే కనీసం 8నెలలున్న తోటల నుంచి చెరకు సేకరించాలి. ప్రస్తుతం జిల్లాలో చాలా ప్రాంతాల్లో పక్వదశకు వచ్చిన తోటలు లేవు. ఫలితంగా రైతులు బెల్లం తయారీ చేపట్టడం లేదు. దీంతో మార్కెట్​కు ఆశించిన సరకు రావడం లేదు. వాస్తవంగా ఈ నెలలో రోజుకి 10 నుంచి 15వేల బెల్లం దిమ్మలు రావాల్సి ఉండగా... కేవలం ఐదారు వేలు మాత్రమే వస్తున్నాయి. ఫలితంగా 10 కిలోల బెల్లం రూ.50 వరకు పెరిగింది. గతంలో 10కిలోల రంగు బెల్లం రూ.300లోపే ఉండేది. పెరిగిన ధరలతో రూ.365 పలుకుతోంది. బెల్లం ధరలు పెరగడంపై... చెరకు రైతులు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details