జగనే రాష్ట్రానికి అతిపెద్ద సమస్య : చంద్రబాబు వైకాపాకు ఓటేస్తే రాష్ట్ర ప్రజలు మరణ వాంగ్మూలం రాసుకున్నట్లే అని ముఖ్యమంత్రిచంద్రబాబు విశాఖ జిల్లానర్సీపట్నంలో అన్నారు. పార్టీ ప్రచార ర్యాలీకి హాజరైన చంద్రబాబు... ప్రతిపక్ష నేతజగనే రాష్ట్రానికి అతిపెద్ద సమస్యగా పేర్కొన్నారు. ఎన్నికల్లో తెదేపా సైనికులు వీరోచితంగా పోరాడుతున్నారని ప్రశంసించారు. తెదేపాకు ఓటేస్తే గెలుపు ప్రజలదేనని స్పష్టం చేశారు. 98 లక్షల ఆడబిడ్డలకు పసుపు - కుంకుమ కింద ఆర్థికసాయం చేశామని తెలిపిన చంద్రబాబు... ఈ ఏడాది విశాఖ జిల్లాకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తుందన్నారు. విశాఖలోని ప్రతి ప్రాంతాన్ని గోదావరి నీటితో సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు మరో 30, 40 ఏళ్ల భావితరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని పేర్కొన్నారు.
ఇవి చదవండి