ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీదేవి ఛానల్ రామకృష్ణం రాజుకు.. అశ్రునయనాలతో తుది వీడ్కోలు - Isukapalli Ramakrishnam Raju died

Isukapalli Ramakrishnam Raju Funeral: శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణం రాజు అంత్యక్రియలను విశాఖలోని జ్ఞానాపురం హిందూ శ్మశానవాటికలో నిర్వహించారు. రాజకీయ ప్రముఖులు, కుటుంబసభ్యులు, కేబుల్ ఆపరేటర్లు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. రామకృష్ణంరాజు కుమారుడు గణేష్ చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Isukapalli Ramakrishnam Raju Funeral
శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణం రాజు

By

Published : Dec 27, 2022, 7:21 PM IST

Isukapalli Ramakrishnam Raju Funeral: శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజుకు రాజకీయ ప్రముఖులు, కుటుంబసభ్యులు, విశాఖ నగరంలో పలువురు కేబుల్ ఆపరేటర్ల అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం ఆయన కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను జ్ఞానాపురం హిందూ దహనవాటికలో నిర్వహించారు. ఆయన కుమారుడు గణేష్ చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు చేశారు. అంతకుముందు మాధవధార, మురళీ నగర్ మీదుగా ఆయన అంతిమయాత్ర జ్ఞానపురం హిందూ శ్మశానవాటికకు చేరుకుంది. అభిమానులు, కేబుల్ ఆపరేటర్లు భారీగా యాత్రలో పాల్గొన్నారు.

ఇసుకపల్లి రామకృష్ణం రాజు గురించి:
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమర్రులో 1949లో జన్మించిన ఇసుకపల్లి రామకృష్ణం రాజు విశాఖలో స్థిరపడ్డారు. వ్యాపారం నిమిత్తం విశాఖకు వచ్చిన రామకృష్ణం రాజు.. 1984లో ఇండో మెరైన్ కంపెనీని స్థాపించారు. ఎందరికో ఉపాధి కల్పిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. 2004లో కేబుల్ రంగంలో అడుగుపెట్టారు. సామాన్యుడికి కేబుల్ ప్రసారాలను చేరువ చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అంతేకాక శ్రీదేవి ఇంటర్నెట్ సేవలను కూడా సామాన్యులకు చేరువ చేశారు. వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ మనసున్న మారాజుగా కీర్తి గడించారు.

శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణం రాజు అంతిమయాత్ర

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details