ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాలు జరగున్న సందర్భంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ముంచంగిపుట్టు మండలంలో ఎస్ఐ ప్రసాద్ అధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. మండలంలోని కుజబంగి, లబ్బుర్, రూడకోట తదితర ప్రాంతాల్లో వాహనాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆటోలు, బస్సులు, ద్విచక్ర వాహనాల మీద వచ్చేవారిని తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాలకు ముందే పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం - andhra odisha border
మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాలు మరో రోజుల్లో మొదలుకాబోతున్న తరుణంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి దుర్ఘటనలకు తావులేకుండా ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో తనిఖీలు