ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పైసా ఖర్చులేకుండా.. గోనె సంచులతో పంటకు రక్షణ! - Visakhapatnam District Chidikada Zone Latest News

రైతులు వినూత్నంగా ఆలోచన చేస్తున్నారు. పంటలను.. పశువులు, పక్షులు పాడుచేయకుండా భిన్నంగా ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని కొందరు రైతులు.. తమ పొలాల్లో గోనె సంచులను ఏర్పాటు చేసి.. పంటలను సంరక్షించుకుంటున్నారు.

పైసా ఖర్చులేకుండా.. గోనె సంచులతో పంటకు రక్షణ!
పైసా ఖర్చులేకుండా.. గోనె సంచులతో పంటకు రక్షణ!

By

Published : Mar 17, 2021, 10:35 AM IST

వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగుచేస్తున్న పంటలను.. కొన్ని ప్రాంతాల్లో పశువులు, పక్షులు పాడు చేస్తున్నాయి. విశాఖ జిల్లా చీడికాడ మండల రైతులు.. ఇలాంటి సమస్యకు భిన్నమైన పరిష్కారాన్ని అమలు చేస్తున్నారు.

పైసా ఖర్చులేకుండా.. గోనె సంచులతో పంటకు రక్షణ!

కోనాం, మంచాల, సిరిజాం, చీడికాడ తదితర ప్రాంతాల్లోని పొలాలకు.. కొందరు కర్రలకు తెల్లటి గోనె సంచులను వేలాడిదీశారు. ఇవి చూసి... పొలంలోకి పశువులు, పక్షులు రాలేదని.. పైసా ఖర్చు లేకుండా గోనె సంచులతో పంటలు సంరక్షించుకుంటున్నామని ఆనందంగా చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details