విశాఖ స్టీల్ ప్లాంట్(vizag Steel Plant) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలు 59వ రోజుకు చేరుకున్నాయి. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఐఎఫ్టీయూ అనుబంధ వైజాగ్ గ్యాస్ వర్కర్స్ పాల్గొన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను తక్షణం విరమించుకోవాలని, స్టీల్ కార్మికుల వేతన ఒప్పందం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలన్నారు. దీక్షా శిబిరాన్ని దగ్ధం చేసిన నిందితులను ఇప్పటికీ గుర్తించకపోవడం దారుణమని.. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలన్నారు.
'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే విరమించుకోవాలి'
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరంలో ఐఎఫ్టీయూ అనుబంధ వైజాగ్ గ్యాస్ వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఉక్కు ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే విరమించుకోవాలని.. శిబిరాన్ని దగ్ధం చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు