ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

IT Raids in Hyderabad : హైదరాబాద్​లో ఐటీ సోదాలు - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

IT Raids in Hyderabad: IT Raids in Hyderabad: తెలంగాణలోని హైదరాబాద్​లో ఐటీ సోదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఎక్సెల్ గ్రూప్​.. దాని అనుబంధ సంస్థలలో అధికారులు రెండు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్​లో ఐటీ సోదాలు
హైదరాబాద్​లో ఐటీ సోదాలు

By

Published : Jan 4, 2023, 10:10 AM IST

IT Raids in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు అలజడి రేపుతున్నాయి. తాజాగా మరోసారి హైదరాబాద్​లో పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 20 బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు 60 మంది సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొంటున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయం, మైండ్ స్పేస్ సమీపంలోని ఎక్సెల్‌ రబ్బర్‌ లిమిటెడ్‌ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్.. ఇన్​ఫ్రా, ఐటీ గ్రూప్, ఇంజినీరింగ్, హెల్త్ కేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నడుపుతోంది. ఈ సంస్థ కార్యాలయంలో.. దీని అనుబంధ సంస్థల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బాచుపల్లి, చందానగర్‌లోనూ కొనసాగుతున్న ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details