విశాఖ జిల్లా పాడేరు డివిజన్ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగదీష్‌ను సరెండర్ చేస్తూ ఐటీడీఏ పీవో బాలాజీ ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో నిర్లక్ష్యం, సమయపాలన లేకపోవడం తదితర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీఓ తెలిపారు. విషయం తెలుసుకున్న జగదీశ్... హుటాహుటిన ఐటీడీఏ పీవోని కలిశారు. బిల్లుల విషయంలో జరుగుతున్న జాప్యం వల్లనే ఇన్ని సమస్యలు వస్తున్నాయన .. సర్దిచెప్పుకొచ్చారు. కానీ, ఫలితం లేకపోయింది. జగదీష్... పీవో సమావేశాలకు సైతం హాజరుకాకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సరెండర్ - పాడేరు డివిజన్
విధుల్లో నిర్లక్షం వహించిన ఉద్యోగిని సరెండర్ చేస్తూ పాడేరు ప్రాజెక్టు అధికారి నిర్ణయం తీసుకున్నారు.
ఇంజనీరింగ్ అధికారి సస్పెండ్