విశాఖ జిల్లాలో ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. వీఎంఆర్డీఏ థియేటర్లో ఏర్పాటు చేసిన విందులో జిల్లా కలెక్టర్ కె. భాస్కర్, ముస్లిం మత పెద్దలు పాల్గొని ప్రార్థనలు చేశారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రార్థనలు చేశారు.
విశాఖ జిల్లాలో ప్రభుత్వ ఇఫ్తార్ విందు - రంజాన్
రంజాన్ పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, పలు శాఖల అధికారులు, ముస్లిం మతపెద్దలు హాజరయ్యారు.
విశాఖ జిల్లాలో ప్రభుత్వ ఇఫ్తార్ విందు