తన బిడ్డకు జరిగిన అన్యాయం ఒక్కొక్కటి బయటకు వస్తోందని వైద్యుడు సుధాకర్ తల్లి కావేరి బాయి అన్నారు. సీబీఐ తనను మరోసారి విచారణకు పిలిస్తే మరిన్ని విషయాలు చెబుతానని వెల్లడించారు. సుధాకర్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసేందుకు హైకోర్టు సమ్మతించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం వరకు ప్రభుత్వం వైపు నుంచి తమపై ఒత్తిడి ఉందని ఆమె వెల్లడించారు. తమకు అండగా నిలిచిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. సీబీఐ న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని చెప్పారు. సుధాకర్‌ను డిశ్చార్జ్ చేసి, మరో ఆసుపత్రిలో చేర్పిస్తామని వైద్యుడు సుధాకర్ తల్లి తెలిపారు.
'మరో అవకాశం ఇస్తే... సీబీఐకి మరిన్ని విషయాలు చెబుతా' - వైద్యుడు సుధాకర్ కేసు తాజా వార్తలు
వైద్యుడు సుధాకర్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసేందుకు హైకోర్టు సమ్మతివ్వటంపై ఆయన తల్లి హర్షం వ్యక్తం చేశారు. సుధాకర్‌ను డిశ్చార్జ్ చేసి, మరో ఆసుపత్రిలో చేర్పిస్తామని తెలిపారు. సీబీఐ తమకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని చెప్పారు.
doctor sudhakar mother