నర్సీపట్నం శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో హుండీ లెక్కింపు - శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో హుండీ లెక్కింపు
నర్సీపట్నంలోని శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో హుండీ లెక్కింపునకు శ్రీకారం చుట్టారు. భక్తుల సందర్శనార్థం పలు కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయించామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
విశాఖ జిల్లా నర్సీపట్నంలో శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో హుండీ లెక్కింపునకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులందరు లెక్కింపులో పాల్గొన్నారు. ఆలయంలోని వ్రతాలు, ప్రత్యేక పూజలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సమకూరిన ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు లెక్కింపు చేపట్టారు. రానున్నరోజుల్లో భక్తుల సందర్శనార్థం పలు కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయించామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. అందుకు తగ్గట్టుగా.. ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.