ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో సంక్రాంతి సందడి... కొనుగోలుదారులతో కూడళ్లు కిటకిట - vizag latest news

విశాఖలో సంక్రాంతి సందడి జోరందుకుంది. జనాలతో నగరంలోని వాణిజ్య కూడళ్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా విశాఖ నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం చర్యలు తీసుకుంది. దుకాణ సముదాయాల వద్ద నెలకొన్న రద్దీని నియంత్రిస్తూ... ట్రాఫిక్​ను చక్కదిద్దుతున్నారు.

huge public rush in vizag to sankranthi festival
విశాఖలో సంక్రాంతి సందడి... కొనుగోలుదారులతో కూడళ్లు కిటకిట

By

Published : Jan 9, 2021, 1:10 AM IST

విశాఖలోని జగదాంబ, ద్వారకానగర్, పోలీస్ బారక్స్, డాబాగార్డెన్ ప్రాంతంలో అధిక సంఖ్యలో ప్రజలు పండుగ వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఈ సమయంలో వాహన రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఈస్ట్ ట్రాఫిక్ వింగ్.... ట్రాఫిక్​ను క్రమబద్ధీకరిస్తున్నారు. పాదచారులకు ఇబ్బంది లేకుండా... జిబ్రా లైన్ నడకకు పోలీసులు సహాయం చేస్తున్నారు. జగదాంబ కూడలి నుంచి పూర్ణ మార్కెట్ వరకు నెలకొన్న విపరీతమైన రద్దీ దృష్ట్యా... పది మంది విధులు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details