విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామానికి సమీపంలో పోలీసులు వాహన తనీఖీలు చేశారు. రూ.3.50లక్షల విలువగల 110 కిలోల గంజాయిని గుర్తించినట్లు నర్సీపట్నం గ్రామీణ పోలీసులు తెలిపారు.
గంజాయి రవాణాకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకుని శివంగి శ్రీనివాసరావు అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. గంజాయి రవాణా వెనుక విశాఖ మన్యం ప్రాంతానికి చెందిన మరికొందరి హస్తం ఉన్నట్టు సమాచారం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.